To Reach Yourself

Telugu Sukthulu

Telugu Sukthulu are the telugu prakruthi quotes and useful suggestion to cross many situations in life. Carry Telugu Sukthulu where ever you go in life and spread happiness and joy in life.

Telugu Sukthulu

జీవిత లక్ష్యానికి

జీవిత లక్ష్యానికి,
సరైన వాటికి సమయం లేదు
అంటున్నారు అంటే
సరిగ్గా సమయపాలనే కాదు
సరిగ్గా దృష్టి పాలనా చేయటం లేదు!
అని అర్థం!

Telugu Sukthulu

ఏదైనా

ఏదైనా జరిగినపుడు
ఆందోళన పడినంత
మాత్రాన తేడా రాదు!
గుర్తుంచుకోండి!

Telugu Sukthulu

మాయలో

మాయలో, భ్రమలో వున్నాం అని
తెలుసుకోవడం మంచిదే!
అంతకంటే ముఖ్యం
బయటపడే
ప్రయత్నం చేయడం’!

Telugu Sukthulu

మారే వాటిని,

మారే వాటిని,
మారే వారిని చూసి
బాధపడుతూ వున్నావు
అంటే
నీలో ఇంకా మార్పు
రాలేదన్నమాట !
నిర్మొహం వైపుకు!

Telugu Sukthulu

కొన్ని అనుభవాలు

కొన్ని అనుభవాలు మనకు
అత్యంత బాధాకరంగా వుండొచ్చు! కానీ
అవే మనకు ఊహించని
పురోగతిని ఇస్తాయి!
గుర్తుంచుకోండి!

Telugu Sukthulu

కావలసిందే జరిగింది!

రావలసిన, కావలసిన అనుభవాలే వచ్చాయి!
కావలసిందే జరిగింది!
మన ఆత్మ పురోగతి కోసం
మనం ఏరి కోరి తెచ్చుకున్న
అద్బుతమైన అనుభవాలే అన్నీ!
గుర్తుంచుకొండి!

Telugu Sukthulu

మన అనవసర ఆలోచనలే

ఈ ప్రపంచంలో అత్యంత ఇబ్బందికర
వ్యసనం మద్యపానం లాంటివి కాదు !
మన అనవసర ఆలోచనలే
మన అతి ఇబ్బందికర వ్యసనాలు!

Telugu Sukthulu

స్వాతంత్రం

బయట ఎంత స్వాతంత్రం
వచ్చినా లొపల కూడా స్వాతంత్రం
రానంత వరకు
మనల్ని మనమే
బానిసలుగా, బందీలుగా
చేసుకుని ఏడుస్తూనే వుంటాం!

Telugu Sukthulu

మీ దారికి మీరే

మీ దారికి మీరే
మంచి ఉదాహరణ అయ్యేంతగా
సాధన చేయండి!
అప్పుడు మీరు ఎవరినీ
నమ్మించే అవసరం వుండదు!

Telugu Sukthulu

మీ గురించి మీకు

మీ గురించి మీకు
ఎంత ఎక్కువగా అర్థం అయితే
మీ కంటే ఎంత ఎక్కువ మంది
గొప్పవాళ్లు
ఈ ప్రపంచంలో వున్నారో
మీకు అర్థం అవుతుంది!

Telugu Sukthulu

గొప్ప బహుమతి

గుర్తుంచుకోండి!
ఒక్కోసారి మనం కోరుకున్నది
జరగక పోవడమే
ఒక గొప్ప బహుమతి
అవుతుంది!
అది అర్థం కావటానికి
కొంతకాలం పడుతుంది అంతే!

Neethi Vakyalu

గమ్యం చేరేది !

దారిలో అయినా నడుస్తూ ఉంటేనే గమ్యం చేరేది !దారి గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటే కాదు!గుర్తుంచుకోండి!- ప్రకృతి

Sad Quotes in Telugu

మనోశాంతి

ప్రతిదీ ఎందుకు జరిగింది
అని సమాధానం కోసం
ప్రయత్నించి
వున్న మనోశాంతి కూడా
పోగొట్టుకోకండి !

Telugu Sukthulu

ఇరుక్కుపోయివుంటే

ఎక్కడైనా మీరు
ఇరుక్కుపోయివున్నారు అంటే
తెలిసో తెలియకో అది మీ నిర్ణయమే
అయివుండవచ్చు !
ఒకసారి సరిచూసుకోండి !

Life Quotes in Telugu

అనిశ్చితత్వవం !

జీవితంలో అనిశ్చితత్వాన్ని
ఆనందంగా స్వీకరించి
ఆనందంగా ముందుకు సాగుతూ
వుండగలగటమే’ జ్ఞానం‘ అంటే !

Telugu Sukthulu

పరిస్థితులు

అన్ని పరిస్థితులనూ
నియత్రించలేక పోవచ్చు కానీ
వేటి ప్రభావం మనపై పడుకుండా
చూసుకునే శక్తి మాత్రం మనకు వుంది !
గుర్తుంచుకోండి !

-ప్రకృతి

Telugu Sukthulu

విజయం!

ఎంతటి విజయమైనా
మొదటి అడుగుతోనే మొదలు అవుతుంది ! గుర్తుంచుకోండి! ఆలస్యం చేయకండి!

error: Content is protected !!