To Reach Yourself

Telugu Inspirational Quotes Wallpapers

Telugu Inspirational Quotes Wallpapers are the Praruthi Quotes with beautiful images which can be use as wall papers. Use the Telugu Inspirational Quotes Wallpapers in mobiles where ever possible and inspire your friends and everybody.

Inspirational Quotes in Telugu

ఇప్పుడూ,ఎప్పుడూ

ఇప్పుడూ,ఎప్పుడూ ఏమీ కాలేదు!అయిపోలేదు జీవితం!చతికిల పడిపోయే పనిలేదు దేనికీ!సాధన తిరిగి మొదలు పెట్టిపట్టుదలతో ముందుకు వెళితేఅన్నీ సర్దుకుంటాయి తిరిగి!అంతే!

Inspirational Quotes in Telugu

జరిగి పోయిన

జరిగి పోయిన తప్పుఒప్పులను
అతిగా ఆపాదించుకుని అద్బుతమైన ఈ క్షణాన్ని
చేతులారా పాడుచేసుకోకండి!
గుర్తుంచుకోండి!

Inspirational Quotes in Telugu

మన ఆలోచనలే

మన ఆలోచనలే మనల్ని
అదః పాతాళానికి తోసేది!
స్వర్గానికీ తీసుకెళ్లేది!
ఆలోచనల గురించి
ఒక్కసారి ఆలోచించండి!

Inspirational Quotes in Telugu

ఏమి చేసినా ఏదోఒకటి
అనుకునే వాడు
ఎప్పుడూ ఈ లోకంలో ఉంటూనే వుంటారు!
వారి మాటలతో మంచి చేసే వారికి,
మంచి దారిలో వెళ్ళే వారికీ
ఏ సంబంధం లేదు!

Inspirational Quotes in Telugu

పట్టుదలతో

పట్టుదలతో జీవిస్తేనే జీవితం!
లేకపొతే దాన్నే బ్రతకడం అంటారు!
బ్రతకాలో, జీవించాలో
ఎవరి ఇష్టం వారిది!

Inspirational Quotes in Telugu

ప్రత్యేకించి

ప్రత్యేకించి భౌతిక జీవితంలేదు!
ఉన్నదంతా ఆధ్యాత్మికమే!
ఆధ్యాత్మిక ప్రయోగాలు
చేయటానికి భూమిపైకి దిగి వచ్చిన
సాధకులం మనమంతా!

Inspirational Quotes in Telugu

మన అహంతో

మన అహంతో లేని సమస్యను
మనమే ఊహించుకుని
దానికి ఇంకొకరు కారణం అని నిందించి
మరింత పెద్దగా చేసుకుని
తీరని బాధగా బ్రతికేస్తూ వుంటాం!
ఎన్నో సార్లు! ఎన్నో విషయాల్లో!
గమనించండి బాగా!

Inspirational Quotes in Telugu

ప్రపంచానికి

ప్రపంచానికి గొప్ప వారిగా నిరూపించు కోవటా నికి నానా తంటాలు పడి అలసి సొలసి పోతున్నాం! తెలియక!
తంటాలేదో మన ఆత్మ పురోగతి కోసం పడితే
ఎంత సాధించే వారమో!
మాటల్లో చెప్పలేం!

error: Content is protected !!