To Reach Yourself

Neethi Vakyalu

Neethi Vakyalu of life. Neethi is the way of life for everybody on earth. Neethi is essence of experience in life with truth after experiments. Use Neethi Vakyalu in life and reach the best Milestones of life.

Neethi Vakyalu

మీరు చేయాలి

మీరు చేయాలి అనుకున్న
మంచి గురించి అవసరానికి మించి
అందరి అభిప్రాయాలు అడిగితే
నిరుత్సాహ పరిచే అవకాశం ఎక్కువ!
చేయడం మొదలు పెట్టండి!
అంతే!

Neethi Vakyalu

ప్రశాంతంగా

మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు,
ప్రపంచమంతా శాంతంగా,హాయిగా
కనిపిస్తుంది! అనిపిస్తుంది!
అంతే!

Neethi Vakyalu

మంచి చేయాలి

మంచి చేయాలి అనుకున్నప్పుడు
ఎవరికోసం, ఎవరి అభిప్రాయాల కొసం
ఎదురు చూడకు!
చేతిలో వున్నది ముందు మొదలుపెట్టు!
లేకపొతే అది ఎప్పటికీ కాదు!

Neethi Vakyalu

మూఢులు

మూఢులు మరియు అజ్ఞానులు
అజ్ఞానం మరియు కోరికతో
స్థిరపడ్డానికి నిర్మించిన
ధర్మాలను సత్యంగా
భావించకండి!
అసలు సత్యం ఏంటో
సాధనతో శోధన చేసి తెలుసుకోండి!

Neethi Vakyalu

గమ్యం చేరేది !

దారిలో అయినా నడుస్తూ ఉంటేనే గమ్యం చేరేది !దారి గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటే కాదు!గుర్తుంచుకోండి!- ప్రకృతి

Neethi Vakyalu

భ్రాంతి

భ్రాంతి ఉన్నన్ని రోజులు
సంపూర్ణ శాంతి వుండదు !
అంతే !

Neethi Vakyalu

సత్య సాధన!

మీరు సత్య సాధనలో వుంటే
ఎవరో కొందరు మీకు సహాయం
చేయనంత మాత్రాన ప్రయాణం ఆగదు !
మరో రూపంలో సహాయం చేయటానికి
ప్రకృతి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది !
గుర్తుంచుకోండి !

-ప్రకృతి

Love Koteshans

మనలని మనం కోల్పోవడం!

దేని వెనక అవసరానికి మించి పడినా
మనల్ని మనం కోల్పోయి వున్నాం అని అర్థం !
ఒక్కసారి గమనించి చూడండి !
అంతే !

-ప్రకృతి

Neethi Vakyalu

మంచి పని!

ఒక మంచి పని చేయటానికి
దారి దొరకటం లేదు అంటే
ఇంకా మనస్ఫూర్తిగా  సంకల్పించలేదు
అని అర్థం చేసుకోండి !
అంతే !

Neethi Vakyalu

చిన్న వాళ్ళు

ఈ ప్రపంచంలో
చిన్న వాళ్ళు ఎవరూ లేరు!
అలా ఎవరైనా కనపడుతున్నారంటే
మనలో చిన్న ఆలోచనలున్నట్లే !
గమనించండి !

error: Content is protected !!