To Reach Yourself

Nammakam Quotes in Telugu

Nammakam quotes in Telugu are about life.All the nammakam quotes are written by Prakruthi Umamahesh.Nammakam on ourselves is very essential for any progress in life.

Nammakam Quotes in Telugu

సందేహాలు

సందేహాలుంటే ఆనందంగా
వదిలేయాలి లేదా
తీర్చుకోవాలి !
రెండూ చేయకపోతే
మెల్లగా అవే సందేహాలు
ఆత్మవిశ్వాసాన్ని
తగ్గేలా చేస్తాయి !

Nammakam Quotes in Telugu

దారి – జ్ఞానం

అనుకున్నది రోజూ చేయగలుగుతున్నారు అంటే ఎక్కువశాతం మీ చేతుల్లోమీరు ఉన్నారని అర్థం !
ఇక కావలసింది సరైన దారి – జ్ఞానం !
అంతే !daari yagnam

Nammakam Quotes in Telugu

నిర్ణయం

నిర్ణయం తీసుకున్నా
వ్యక్తులపై ఆధారపడి కాక
సత్యసాధనలో భాగంగా తీసుకుంటే
ఎప్పడూ ఏ బాధా వుండదు !

Nammakam Quotes in Telugu

ఉద్యోగం

ఉద్యోగం కావాలి అనుకుంటే
ఉద్యోగం గురించే ఎక్కువ మాట్లాడండి !
నిరుద్యోగం గురించి కాదు !
అంతే !

Nammakam Quotes in Telugu

ఎప్పుడు మాట్లాడినా!

ఎప్పుడు మాట్లాడినా ఇలా
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ?
1.ఇది అవసరమేనా ?
2.సత్యమేనా ?
3.కరుణతోనే మాట్లాడుతున్నారా ?

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

ఏకైక పని

ప్రపంచంలోవున్న అతిముఖ్యమైన
ఏకైక పని ఏంటి అంటే ?
ఈ క్షణంలో వుండటమే !

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

ముక్తి

పుట్టడం విశేషం కాదు !
మళ్ళీపుట్టే
అవసరం లేకుండా
జీవించగలగడమే
అసలు విశేషం అంటే!

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

మనకు రావలసిన సహాయం!

ఎవరు మనకు సహాయం చేస్తారు?,
మనతో ఎవరు వుంటారు ?
అని ఆలోచించే పనిలేదు !
మనం చేయవలసిన పని చేస్తే
మనకు రావలసిన సహాయం
వస్తూనే వుంటుంది !
అంతే !

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

దృష్టి!

పనిపై మాత్రం
దృష్టి పెడితే చాలు !
వ్యక్తులు వారి సమయంలో
వారే వస్తారు !
అంతే !

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

ఆటంకాలు!

ఆటంకాలు వాటికవే
తొలగాలి అంటే
గమ్యంపై
దృష్టి మరింత పెంచాలి !
అంతే !

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

గురువు

మనకు మనము
అర్థం అయినప్పుడే
గురువు అర్థం అయ్యేది !
అంతే!

-ప్ర

కృతి

Nammakam Quotes in Telugu

నమ్మకం!-2

అడుగు వేయటానికి
ఎక్కువ ఆలోచించకండి !
మీరు వేసే అడుగే
మిమ్మల్ని నడిపిస్తుందని
గుర్తుంచుకోండి !

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

నమ్మకం

ఎవరు మనకు సహాయం చేస్తారు?,
మనతో ఎవరు వుంటారు ?
అని ఆలోచించే పనిలేదు !
మనం చేయవలసిన పని చేస్తే
మనకు రావలసిన సహాయం
వస్తూనే వుంటుంది !
అంతే !

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

Freedom

స్వేచ్ఛను ఇచ్చి పుచ్చుకోవడమే
అసలైన ప్రేమ!
అసలైన జ్ఞానం అంటే!

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

Ignorance

మార్పు నాలో కాదు ప్రపంచంలో రావాలి!
అనుకుంటూ జీవించడమే
ఒకానొక అజ్ఞానం!
అంధకారం!
-ప్రకృతి

Nammakam Quotes in Telugu

మనోళ్లు

మనోళ్లు కూడా మనల్ని
మంచోడు అనుకునే పనిలేదు!
మన మనస్సాక్షికి మనపై
సరైన అభిప్రాయం వుంటే
అదే పదివేలు!

Nammakam Quotes in Telugu

సత్యమా ? జనమా ?

సత్యం వెనుక మనం వెళితే
జనం మనవెనుక రావడం
మొదలు పెడతారు!
లేదంటే జనం వెనుక
మనం పడాలి!
ఏది చెయ్యాలో మరి ?
సత్యమా ? జనమా ?

Nammakam Quotes in Telugu

మీతో మీరు

మీతో మీరు లేకపోతే
ఇక ఏమి వున్నా, ఎవరు వున్నా, ఎక్కడున్నా
పెద్దగా ఉపయోగంలేదు !
గుర్తుంచుకోండి!

Nammakam Quotes in Telugu

సమయం!

మీతో మీరు
ఎంత సమయం గడిపారు?
ఎలా గడిపారు ?
అన్నదే మీ మిగిలిన జీవితానికి
అసలైన పునాది !
గుర్తుంచుకోండి !

Nammakam Quotes in Telugu

నేను!

నేను అన్నది వచ్చిందా ?
అయితే మనల్ని మనమే కోల్పోవడం మొదలుపెట్టాం అన్నమాట!!
అంతే!

  • 1
  • 2
error: Content is protected !!