To Reach Yourself

Month: February 2019

Telugu Quotations in Telugu Language

మంచికే

జరిగినది ఏదైనా,
ఎందుకు అయినా సరే
అది మంచికే !
సహనంతో
తిరిగి శక్తిని పెంచుకుంటూ
వేచివుండండి !
సరైన సమయం కోసం!
అంతే !

Telugu Quotations in Telugu Language

లక్ష్యాలు

ఉన్నవి రెండే లక్ష్యాలు :
1.ఈ క్షణంలో
సంపూర్తిగా వుండటం !
2. ఎప్పుడూ
మనోశూన్యంలో వుండటం !
మిగిలినవాటి గురించి
ఆసమయంలో ఆలోచిస్తే చాలు!
అంతే!

Telugu Matalu

పాజిటివ్ గా

మనతో మనం
మాట్లాడుకునేటప్పుడు కూడా
పాజిటివ్ గా
మాట్లాడుకోగలిగినపుడే
ఆనందం – ఆత్మవిశ్వాసం !
అంతే!

Telugu Matalu

సమయం 1

మీరు మీరుగా ఉండగలిగే వారితోఎక్కువ సమయం,నెగటివ్ ఆలోచనలున్న వారితో తక్కువసమయం గడపండి !అంతే!

Telugu Matalu

స్వీకరించటం

మిమ్మల్ని మీరు
ప్రేమతో స్వీకరించిన రోజు
మీరు మరింత
అందంగా, ఆనందంగా
తయారవుతారు !
గుర్తుంచుకోండి !

Telugu Matalu

సరైన ధర్మం

మీరు అందరిలా వుండే అవసరం
ఏమాత్రంలేదు!
మీరు మీరుగా వుంటూనే
సరైన దారిలో నడవటమే
సరైన ధర్మం !
అంతే !

Telugu Matalu

జీవితమంతా

ఎలా జీవించాలా అని ఆలోచిస్తూ
జీవితమంతా గడపేయకండి !
తెలిసిన,అర్థం అయిన
ఏదో ఒక చిన్న సత్యంతో ఐనా
జీవించడం మొదలుపెట్టండి!
అంతే!

Anando Brahma

ఆనందం వుండదు !

గొప్పగా అనిపించుకోవడానికిఏది చేసినాచివరికి ఆయాసమే తప్పఆనందం వుండదు !అదే చేతిలో ఉన్నపనిగొప్పగా చేయటానికి ప్రయత్నిస్తేఆనందమే ఆనందం !గుర్తుంచుకోండి !

Motivational Quotes in Telugu

మార్చటానికి ప్రయత్నిస్తే

మీ విషయంలో ఇతరులను మార్చటానికి
ప్రయత్నిస్తే ఆయాసం తప్ప
ఇంకేదీ రాదు !
కానీ వారి చేష్టలకు
మీ స్పందన మార్చుకోవడంపై
దృష్టి వుంచితే
ఆనందం వచ్చే అవకాశం
ఎంతైనా ఉంది!

Jnani Quotes

జ్ఞానం మాయం

ఇతరులలో చెడు మాత్రమే
కనబడుతోంది అంటే
జ్ఞానం మాయం అయ్యుండాలి !
లేక జ్ఞానం ఇంకా
మొదలే కాకుండాలి !
అంతే!

Anando Brahma

మీరు ఎంత ఆనందంగా వున్నారు

ఇతరులతోమీతో మీరు ఎంత ఆనందంగా వున్నారు?
ఒక్కసారి ప్రశ్నించుకోండి !
మీరు మీతో ఎంత ఆనందంగా వుంటే
అంతే ఆనందంగా
ఇతరులతో వుండగలుగుతారు !
గుర్తుంచుకోండి !

Life Quotes in Telugu

సమయమే జీవితం!

సమయమే జీవితం!
అవసరానికి మించి ఇతరుల విషయాల్లో తలదూర్చి సమయం వృధా చేసుకుంటే
మన జీవితాన్ని వృధా చేసుకున్నట్టే !
గుర్తుంచుకోండి !

error: Content is protected !!