To Reach Yourself

Month: January 2019

Life Quotes in Telugu

మంచి రోజులు

మంచి రోజులు వస్తాయని ఎదురు చూడడం వల్ల లాభంలేదు!

మంచిని పెంచడం వల్లే
ఉన్న లాభం అంతా!

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

నమ్మకం!-2

అడుగు వేయటానికి
ఎక్కువ ఆలోచించకండి !
మీరు వేసే అడుగే
మిమ్మల్ని నడిపిస్తుందని
గుర్తుంచుకోండి !

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

నమ్మకం

ఎవరు మనకు సహాయం చేస్తారు?,
మనతో ఎవరు వుంటారు ?
అని ఆలోచించే పనిలేదు !
మనం చేయవలసిన పని చేస్తే
మనకు రావలసిన సహాయం
వస్తూనే వుంటుంది !
అంతే !

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

Freedom

స్వేచ్ఛను ఇచ్చి పుచ్చుకోవడమే
అసలైన ప్రేమ!
అసలైన జ్ఞానం అంటే!

-ప్రకృతి

Nammakam Quotes in Telugu

Ignorance

మార్పు నాలో కాదు ప్రపంచంలో రావాలి!
అనుకుంటూ జీవించడమే
ఒకానొక అజ్ఞానం!
అంధకారం!
-ప్రకృతి

Sad Quotes in Telugu

దుఃఖానికి మూలకారణం

సాధన పక్కన పెట్టి
ఎదుటివాడిలో మార్పు కోసం
పరు గెత్తడమే
‘దుఃఖానికి ఒకానొక మూలకారణం!
గుర్తుంచుకోండి!
– ప్రకృతి

Neethi Vakyalu

చిన్న వాళ్ళు

ఈ ప్రపంచంలో
చిన్న వాళ్ళు ఎవరూ లేరు!
అలా ఎవరైనా కనపడుతున్నారంటే
మనలో చిన్న ఆలోచనలున్నట్లే !
గమనించండి !

Telugu Sukthulu

విజయం!

ఎంతటి విజయమైనా
మొదటి అడుగుతోనే మొదలు అవుతుంది ! గుర్తుంచుకోండి! ఆలస్యం చేయకండి!

Nammakam Quotes in Telugu

మనోళ్లు

మనోళ్లు కూడా మనల్ని
మంచోడు అనుకునే పనిలేదు!
మన మనస్సాక్షికి మనపై
సరైన అభిప్రాయం వుంటే
అదే పదివేలు!

Sad Quotes in Telugu

ఆత్మగౌరవం – ఆత్మ శాంతి!

ఆత్మగౌరవం మరి ఆత్మ శాంతి!!
ఇవే మన అసలైన మరి విలువైన ఆస్తులు!
వేటికోసము వీటిని తాకట్టు పెట్టినా
చివరికి మిగిలేది దుఃఖమే!
గుర్తుంచుకోండి!

Anando Brahma

ఆనందం!

ఏది ఏమైనా ఆనందంగా వుండాలి!
అని నిర్ణయం వీలైతే
ఇప్పుడే ఇక్కడేతీసుకోండి!
అంతే!

Nammakam Quotes in Telugu

సత్యమా ? జనమా ?

సత్యం వెనుక మనం వెళితే
జనం మనవెనుక రావడం
మొదలు పెడతారు!
లేదంటే జనం వెనుక
మనం పడాలి!
ఏది చెయ్యాలో మరి ?
సత్యమా ? జనమా ?

Nammakam Quotes in Telugu

మీతో మీరు

మీతో మీరు లేకపోతే
ఇక ఏమి వున్నా, ఎవరు వున్నా, ఎక్కడున్నా
పెద్దగా ఉపయోగంలేదు !
గుర్తుంచుకోండి!

Nammakam Quotes in Telugu

సమయం!

మీతో మీరు
ఎంత సమయం గడిపారు?
ఎలా గడిపారు ?
అన్నదే మీ మిగిలిన జీవితానికి
అసలైన పునాది !
గుర్తుంచుకోండి !

Nammakam Quotes in Telugu

నేను!

నేను అన్నది వచ్చిందా ?
అయితే మనల్ని మనమే కోల్పోవడం మొదలుపెట్టాం అన్నమాట!!
అంతే!

  • 1
  • 2
error: Content is protected !!